భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) యూపీఐ ( BSNL UPI ) మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కొత్త సేవ BSNL Pay పేరుతో రానుంది. ఇది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
BSNL Pay సేవలు – ప్రధాన లక్షణాలు:
- ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్: రీచార్జ్, బిల్ పేమెంట్, UPI ట్రాన్సాక్షన్స్, డిజిటల్ చెల్లింపులు అన్నీ ఒకే యాప్‌లో.
- సురక్షితమైన చెల్లింపులు: BHIM UPI ప్రోటోకాల్ ఆధారంగా పనిచేయడం వల్ల అధిక భద్రత.
- తక్కువ ఫీజులు: ప్రైవేట్ యాప్‌ల కంటే తక్కువ ఛార్జీలు ఉండే అవకాశం.
- ప్రత్యేక యాప్ అవసరం లేదు: BSNL సెల్ఫ్ కేర్ యాప్‌లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?
BSNL ఇంకా అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, 2025 దీపావళి నాటికి BSNL Pay సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి దశలో BSNL కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
మరో గుడ్ న్యూస్: BSNL 5G సేవలు
ఇటీవల కొన్ని నగరాల్లో 5G సిమ్ కార్డులను ప్రారంభించిన BSNL, దీపావళి నుంచి BSNL 5G సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇది BSNL యూజర్లకు డబుల్ బోనస్ అవుతుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
