మన పత్రిక, వెబ్‌డెస్క్: శేరిలింగపల్లిలో జరిగిన 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో నాచారంలోని డక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారి సృజనాత్మకతకు గాను పాఠశాల చైర్మన్ నవనీతరావు, ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో హనియా ఫాతిమా, సయ్యద్ ఆఫియా ఫాతిమా, అనుల్ పులగం అత్యుత్తమ విజయాలు సాధించారు. అలాగే జిల్లా స్థాయిలో ఇషాన్ దాసరి, నక్షత్ర రావు మధురి, కటకం సూర్యాన్, దయాగ రిత్విక్ తమ కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఇలాంటి వేదికలు విద్యార్థుల్లోని ఊహాశక్తిని, కళా ప్రతిభను వెలికితీస్తాయని యాజమాన్యం పేర్కొంది. పిల్లల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
