Lakshmi Mittal : ఒకటి కాదు.. రెండు.. ఏకంగా 30 ఏళ్ల పాటు బ్రిటన్‌లో ఉంటూ అక్కడి బిలియనీర్లలో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. ఈయన్ను అందరూ స్టీల్ టైకూన్ అని పిలుస్తారు. స్టీల్, ఉక్కు బిజినెస్ చేసే లక్ష్మీ మిట్టల్ 30 ఏళ్ల నుంచి యూకేలో ఉంటూ తన బిజినెస్ ను విస్తరించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ ఫౌండ్లు.
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి బ్రిటన్ లోనే ది గ్రేట్ అనిపించుకున్న లక్ష్మీ మిట్టల్ ది రాజస్థాన్. ప్రస్తుతం ఈయన కంపెనీ వరల్డ్ లోనే రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి లక్ష్మీ మిట్టల్ కొడుకు ఆదిత్య మిట్టల్ సీఈఓగా ఉన్నారు.
1995 లోనే లక్ష్మీ మిట్టల్ లండన్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్న మిట్టల్.. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను మినహాయింపు రద్దు కారణంతో బ్రిటన్ ను వదిలేసి స్విట్జర్లాండ్ కు షిఫ్ట్ అయ్యారు. వారసత్వ పన్ను మినహాయింపు రద్దు వల్ల ట్యాక్సుల భారం ఎక్కువవుతుండటంతో బ్రిటన్ నుంచి తన మకాన్ని లక్ష్మీ మిట్టల్ మార్చినట్టు తెలుస్తోంది. లండన్ లో మిట్టల్ కు అతి పెద్ద ప్యాలెస్ ఉంది. కెన్సింగ్టన్ లో మిట్టల్ కు ఆ ప్యాలెస్ ఉంది. దుబాయ్, యూరప్, యూఎస్ లలోనూ మిట్టల్ కు పలు ఆస్తులు ఉన్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
