Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే.. ధర్మేంద్ర గతంలోనే ఒకసారి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అక్టోబర్ 31న ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.
1935 లో జన్మించిన ధర్మేంద్ర… బాలీవుడ్ హీరోయిన్ హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. 1960 లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన కెరీర్ లో 300 వరకు సినిమాల్లో నటించారు. షోలే, డ్రీమ్ గర్ల్, ధర్మవీర్, చుప్కే చుప్కే లాంటి సినిమాలు ధర్మేంద్రకు మంచి పేరు తీసుకొచ్చాయి. తన చివరి మూవీ ఇక్కీస్. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇటీవల తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా అనే మూవీలో ధర్మేంద్ర నటించారు. షాహిద్ కపూర్ ఆ సినిమాలో హీరో. ధర్మేంద్రకు 2012 లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. కొన్నేళ్లు రాజకీయాల్లోనూ ధర్మేంద్ర చురుగ్గా పాల్గొన్నారు. 2004 లో ఎంపీగాను పని చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
