SS Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని పొందిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి గ్లోబ్‌ట్రోటర్ మూవీగా పిలిచారు. ఈ మూవీ ఈవెంట్ లో హనుమాన్ ని కించపరిచేలా రాజమౌళి వ్యాఖ్యలు చేశాడని రాష్ట్రీయ వానర సేన సంఘం ఇప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. వారణాసి గ్లింప్స్ లో భాగంగా మహేశ్ బాబు లుక్ ను రివీల్ చేసిన బృందం.. అందులో మహేశ్ బాబు నందిపై కూర్చొని కనిపించాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నందిపై హీరోను కూర్చోబెట్టడం ఏంటి.. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనపై ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.
అలాగే.. బాహుబలి ది ఎటర్నల్ లో వార్ ట్రైలర్ లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా రాజమౌళి చూపించారని, అందుకే ఆయనపై మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఆయన మీద ప్రస్తుతం మూడు కేసులు నమోదైనట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
