Chain Snatching : హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంట రోడ్డుపై ఈ ఘటన జరిగింది. తూంకుంట రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు దగ్గరగా బైక్ పోనిచ్చి ఆమె మెడలోని గొలుసును లాక్కొని పరారయ్యారు.
వెంటనే తేరుకున్న ఆ మహిళ వాళ్ల వెంట పరిగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న మెడికల్ షాపులో రికార్డయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
