WhatsApp
Advertisement

SS Rajamouli : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదు

SS Rajamouli : ఇటీవల హైదరాబాద్ లో గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి హనుమాన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన.. ఆయనపై కేసు పెట్టింది.

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ వానరసేన రాజమౌళిపై కేసు నమోదు చేసింది. భవిష్యత్తులో ఇంకెవ్వరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు కోరారు.

Advertisement
Advertisement