Husband Suicide : 8 నెలలు నిండిన ఓ గర్బిణీ నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అది తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అందులోనూ తన భార్య కడుపులో ఉన్నది కవల పిల్లలు. కవలలు జన్మిస్తారని ఎంతో ఆశపడ్డ ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న విజయ్.. ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో నివాసం ఉంటున్నాడు. తన భార్య పేరు శ్రావ్య. వీళ్లకు పెళ్లి అయి ఏడాది అయినా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందకు సిద్ధపడ్డారు. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా భార్య శ్రావ్యకు గర్భం వచ్చింది.
తనకు ఇప్పుడు 8 నెలలు. కడుపులో కవలలు ఉన్నట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. కానీ, తాజాగా శ్రావ్యకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అత్తాపూర్ లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెస్ట్ చేసిన వైద్యులు కడుపులో ఉన్న కవల పిల్లలు చనిపోయినట్టుగా తెలిపారు. శ్రావ్యకు కూడా సీరియస్ గా ఉండటంతో మరో ఆసుపత్రికి తరలించారు. అంతలోనే శ్రావ్య కూడా చనిపోయింది.
తన భార్య కూడా చనిపోవడంతో ఏం చేయాలో తెలియని విజయ్.. తన ఇంటికి వెళ్లిపోయాడు. శ్రావ్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రావాలని మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేస్తే విజయ్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా విజయ్ ఫ్యాన్ కు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
