మన పత్రిక, వెబ్డెస్క్ : సుప్రీంకోర్టు ( SUPREME COURT ) లంబాడా, బంజారా, సుగాలీ కులాలకు ఎస్టీ హోదా కల్పించడంపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
supreme court st status banjaras lambadis
పిటిషనర్లు ప్రధానంగా చేసిన వాదనలు:
Advertisement
- లంబాడా, సుగాలీలు 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించబడలేదు.
- వారు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానిక గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని ఆరోపణ.
- ఈ వర్గాలు బీసీ జాబితాలో ఉండేవి, తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చారు.
- హైదరాబాద్ స్టేట్ ప్రాంతంలో వారిని ఎస్టీగా గుర్తించలేదు.
- ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినందున, తెలంగాణలో వీరిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్.
- ఆర్టికల్ 342కి విరుద్ధంగా ఎస్టీ హోదా కల్పించడంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు సహా ఇతరులు దాఖలు చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
