WhatsApp
Advertisement

Varanasi : వారణాసి మూవీలో రుధ్రగా మహేశ్ బాబు.. సినిమా స్టోరీ ఏంటి? రిలీజ్ ఎప్పుడు?

Varanasi : మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ పేరు వారణాసిగా నిన్న జరిగిన ఈవెంట్ లో మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో రుధ్రగా మహేశ్ బాబు నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ను మాత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది కానీ.. ఆ ట్రైలర్ లో సినిమా స్టోరీ ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఎద్దు మీద రౌద్రంతో వస్తున్న రుధ్రగా మహేశ్ బాబు కనిపిస్తాడు.

ట్రైలర్ ప్రకారం చూస్తే 2027 లో ఓ ఆస్టరాయిడ్ భూమిని తాకుతుంది. దాని వల్ల భూమండలం నాశనం అవుతుంది. దీనికి సంబంధించిన చరిత్ర క్రీ.శ. 720 సంవత్సరం నుంచే ప్రారంభం అవుతుంది. అంతకుముందు త్రేతాయుగంలో జరిగిన ఘటనలను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. తిరిగి వారణాసికి ఈ మూవీని కనెక్ట్ చేయనున్నారు. అత్యంత వేడి ఉండే ఆఫ్రికా అడవుల నుంచి అత్యంత చల్లదనం ఉండే అంటార్కిటికా వరకు అన్ని ప్రదేశాలను కలుపుతూ ఈ ట్రైలర్ లో చూపించారు. అంటే ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ దేవుడి చుట్టూ ఈ సినిమా తిరిగేలా ఉంటుంది. ఇదే ఈ సినిమా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.

Advertisement

అయితే.. ఈ మూవీలో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్టు సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ మూవీని 2027 లో విడుదల చేయనున్నారు. గ్లోబ్ ట్రోటర్ తో పాటు టైమ్ ట్రోటర్ అని కూడా ఈ మూవీకి హ్యాష్ ట్యాగ్స్ ను జతపరిచారు.

Advertisement