Ibomma : ఐబొమ్మ కావచ్చు.. బప్పం కావచ్చు.. మరో పేరు కావచ్చు.. పేర్లు ఏవైనా కూడా వాళ్ల గురి మాత్రం ఒక్కటే. సినిమా విడుదలైన వెంటనే హెచ్డీ ప్రింట్ తో వెబ్ సైట్ లో దర్శనం ఇస్తుంది. ఆ మూవీని థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని ఇంట్లోనే చూసేయొచ్చు. అలాంటి అవకాశం కల్పించింది ఐబొమ్మ. థియేటర్ లో, ఓటీటీలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా వెంటనే దాన్ని పైరసీ చేసి ఐబొమ్మ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడమే వాళ్ల పని. వాళ్లు ఎక్కడి నుంచి ఆ వెబ్ సైట్ ని ఆపరేట్ చేస్తున్నారో ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా అప్ లోడ్ అవుతుండటంతో సినీ లవర్స్ కూడా అందులో నుంచి డౌన్ లోడ్ చేసుకొని చూడటం మొదలు పెట్టారు. దీంతో ఐబొమ్మకు చాలా క్రేజ్ వచ్చేసింది.
ఐబొమ్మ కేసును పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈ వెబ్ సైట్ ను ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారు.. అనే విషయం తెలుసుకోవడం కోసం ఎక్స్‌పర్ట్స్‌తో టీమ్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ఆ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న తెలుగు వ్యక్తి ఇమ్మడి రవిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
శనివారం ఉదయం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో పక్కా సమాచారంలో ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి శుక్రవారమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు సీసీఎస్ పోలీసులు తెలుసుకున్నారు. శనివారం ఉదయం కూకట్ పల్లిలో అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. కరేబియన్ ఐలాండ్ లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
