Hijras Attack : గృహ ప్రవేశం రోజు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఓ ఇంటి యజమానిని హిజ్రాలు చితకబాదారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది. కీసర సమీపంలోని చీర్యాల అనే ఏరియాలో ఉన్న బాలాజీ ఎన్‌క్లేవ్‌లో కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకులను ఆ వ్యక్తి చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన హిజ్రాలు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
దీంతో డబ్బులు ఇచ్చేందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. వెంటనే మరో 15 మంది హిజ్రాలను తీసుకొచ్చి ఆ ఇంటి కుటుంబ సభ్యుల మీద హిజ్రాలు విచక్షణా రహితంగా దాడి చేశారు. హిజ్రాల దాడితో ఇంటి యజమాని సదానందం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
