Montha Cyclone : ఇటీవల వచ్చిన మొంథా తుపాన్ రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ మొంథా తుపాన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పంట చేతికొచ్చింది అనుకునే లోపే తుపాను రావడంతో తెలంగాణలో ఉన్న వరి పంట మొత్తం నేలకొరిగింది. పంట నేలకొరిగిందని ఓ రైతు గుండెపోటుతో మృతి చెందగా, పంట దిగుబడి లేదని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన ఇజ్జయ్య అనే 65 సంవత్సరాల రైతు వర్షాలకు దెబ్బతిన్న తన పంటను చూసి తట్టుకోలేక పొలంలోనే గుండెపోటుతో మృతి చెందాడు.
మరోవైపు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడేనికి చెందిన ఉపేందర్ రెడ్డి అనే రైతు అప్పు తెచ్చి పంట వేశాడు. కాననీ, ఇటీవల కురిసిన వర్షానికి పంట మొత్తం నాశనం అవ్వడంతో అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
