Chikiri Chikiri Video Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పడానికి తాజాగా రిలీజ్ అయిన చికిరి చికిరి వీడియోనే నిదర్శనం. ఎందుకంటే.. చికిరి చికిరి సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
కాళ్లకు చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా ఎంతో ఈజీగా డ్యాన్స్ చేసిన రామ్ చరణ్ ను చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్టర్. ఏ.ఆర్. రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సంవత్సరం వేసవి కానుకగా విడుదల కానుంది. మార్చి 27, 2026 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
