మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) కూరగాయలు సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించి, సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి ₹9,600 చొప్పున సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.
ఒక ఎకరా కూరగాయల సాగుకు సుమారు ₹24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అందులో 40% (అనగా ₹9,600) నిధులను సబ్సిడీగా అందించనుంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అంటే, ఒక రైతు గరిష్టంగా ₹48,000 వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
