Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 6.3 తీవ్రతతో దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 150 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చాలా ఇళ్లు కూలిపోయాయి. దీని వల్ల ఇంటి శిథిలాల్లో చాలామంది ప్రజలు చిక్కుకుపోయారు.
Advertisement
దేశంలోని సామన్‌గాన్ ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. 6.3 తీవ్రతతో నమోదైన భూకంప కేంద్రం ఖుల్మ్ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 28 కి.మీల లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఈ భూకంపం ధాటికి చాలా గ్రామాలు నేలమట్టం అయ్యాయి.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

