మన పత్రిక, వెబ్డెస్క్ : మెగా మరియు అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) అర్థరాత్రి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు.
Allu Kanakarathnamma Passes Away
ఆమె అంత్యక్రియలు ఆగస్టు 30, 2025 మధ్యాహ్నం హైదరాబాద్ లోని కోకాపే లో నిర్వహించనున్నారు. తమ నానమ్మ చివరి దర్శనానికి బన్నీ (అల్లు అర్జున్) ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. విషాద సమయంలో పవన్ కళ్యాణ్, నాగబాబులు విజయవాడలో జరిగే జనసేన బహిరంగ సభ నుంచి ఆదివారం హైదరాబాద్ వచ్చి కుటుంబాన్ని కలిసి సంతాపం తెలిపే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
