మన పత్రిక, మిర్యాలగూడ: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా (ఏబీసీడీఓ) ఎంపికైన 16 మందికి శుక్రవారం సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. నూతన ఉద్యోగ ప్రయాణంలో భాగంగా, బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆయన విజేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
