మన పత్రిక, వెబ్‌డెస్క్ : ఆగస్టు 30, 2025 నేటి రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత ఫలితాలు ఇక్కడ ఉన్నాయి
Today Horoscope in telugu August 30 2025
మేషం
వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల మద్దతుతో లక్ష్యాలు సాధిస్తారు. పట్టుదల మీద నడిచి బంగారు భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. చంద్రధ్యానం అనుకూలం.
వృషభం
దైవ సహాయం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో సమయస్ఫూర్తి చూపి ప్రశంసలు అందుకుంటారు. ఈశ్వర ఆరాధన లాభకరం.
మిథునం
శుభకాలం. సాహస నిర్ణయాలు మంచి లాభాలను తీసుకురావడం ఖాయం. ధైర్యంతో ముందుకు సాగి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తుతి ప్రయోజనకరం.
కర్కాటకం
ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కానీ అధిగమిస్తారు. లక్ష్యాలు చేరడానికి కష్టపడాలి. భవిష్యత్తు కోసం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నవగ్రహ సందర్శనం శుభప్రదం.
సింహం
ప్రారంభించే పనిలో చంచలత్వం నియంత్రించండి. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టేవారు చుట్టూ ఉంటారు. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి. ఈశ్వర శ్లోకాలు చదవడం మంచిది.
కన్య
ప్రారంభించే పనుల్లో బుద్ధి మీద ఆధారపడితే విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయండి. శివ సహస్రనామ పారాయణ లాభకరం.
తుల
తోటివారితో కలిసి పనిచేస్తే త్వరిత ఫలితాలు లభిస్తాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఇష్టదైవ శ్లోకాలు చదవడం మంచిది.
వృశ్చికం
ఉద్యోగులకు శుభకాలం. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధు మిత్రుల ప్రేమ, ఆదరణ ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.
ధనస్సు
ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అలసట రాకుండా జాగ్రత్త పడండి. నిర్ణయాల్లో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శన ఉత్తమం.
మకరం
మిశ్రమ ఫలితాలు. మీ రంగంలో ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త పడండి. నవగ్రహ ధ్యానం లాభకరం.
కుంభం
ఆత్మీయుల మద్దతుతో లక్ష్యాలు సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. మీ రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రీరామ నామ జపం మంచిది.
మీనం
మనస్తాపం లేకుండా ధైర్యంతో ముందుకు సాగండి. బుద్ధితో అడ్డంకులను అధిగమిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
