Youtube : ఏఐ యుగం ఇది. ఏఐ అనేది ఒక్క ఐటీ రంగమే కాదు.. అన్ని రంగాలను దెబ్బ తీస్తోంది. ఐటీ రంగం, కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, వీడియో క్రియేషన్.. ఇలా పలు రంగాలపై ఏఐ ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా 30 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
తాజాగా ఆ లిస్టులోకి యూట్యూబ్ కూడా చేరింది. కానీ.. యూట్యూబ్ మాత్రం నేరుగా ఏ ఉద్యోగిని తొలగించబోమని.. వాలంటరీగా కంపెనీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్న వాళ్లకు మాత్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. అంటే పొమ్మనకుండా పొగబెట్టడం లాంటిది అని చెప్పుకోవచ్చు. వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ను తాజాగా యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ ప్రకటించారు.
యూఎస్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ప్లాన్ ను యూట్యూబ్ మేనేజ్ మెంట్ ఆఫర్ చేసింది. ఆ ప్లాన్ కి యాక్సెప్ట్ చేసే వళ్లకు భారీగా సెవరేజ్ ప్యాకేజీ ఇచ్చి కంపెనీ నుంచి బయటికి పంపిస్తారు. యూట్యూబ్ ఏఐని అందిపుచ్చుకోవడం కోసం, ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవడం కోసం ఇలాంటి ప్రకటనలు తప్పడం లేదని యూట్యూబ్ వెల్లడించింది. కొన్ని డిపార్ట్ మెంట్లలో ఏఐ ఆధారిత సర్వీస్ లను యూట్యూబ్ ఇంటిగ్రేడ్ చేయడం వల్ల మ్యాన్ పవర్ వర్క్ చాలా వరకు తగ్గనుండటంతో వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ను కంపెనీ ప్రకటించింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

