ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి ఇంజనీర్.. రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్!
మన పత్రిక, వెబ్‌డెస్క్: యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం (yadagirigutta temple) సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ దుకాణంలో ఆయన్ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Advertisement
విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఆయనకు చెందిన పలు ఆస్తులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. రామారావుపై ఇదివరకే అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయని సమాచారం. వందల ఎకరాల భూములు బినామీ పేర్లపై సమకూర్చారనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
