మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో దారుణ ప్రమాదం జరిగింది. శేషిలేడివాగు బ్రిడ్జిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25), అతని భార్య అనుష (21) తీవ్రంగా గాయపడ్డారు.
ఢీకొన్న వేగానికి అనుష బ్రిడ్జి పైనుంచి ఎగిరి ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. స్థానికులు 15 నిమిషాల తర్వాత ఆమెను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను, తీవ్ర గాయాలపాలైన భర్త నవీన్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, అనుష మార్గమధ్యలోనే మృతి చెందింది.
Advertisement
నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఢీ కొట్టిన బైకుపై ఉన్న వ్యక్తికి, అతని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. కేవలం పది రోజుల క్రితమే నవీన్, అనుషలకు ప్రేమ వివాహం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
