Jaanvi Swarup : సూపర్ స్టార్ కృష్ణ నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కృష్ణకే ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు అంటే మహేశ్ బాబు అనే చెప్పుకోవాలి. కృష్ణ ఫ్యామిలీలో చాలామంది సినిమా రంగంలోకి వచ్చినా, మహేశ్ బాబుకు వచ్చినంత పేరు రాలేదు. ఆయనకున్నంత క్రేజ్ వేరే వాళ్లకు లేదు. అయితే, ఏ స్టార్ అయినా సరే.. తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు తప్పితే కూతుళ్లను చేయరు. చాలా తక్కువ మంది స్టార్ల కూతుళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు.
తాజాగా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న ఓ అమ్మాయి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె ఎవరో కాదు.. కృష్ణ మనవరాలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్. ఆమె ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నదట. ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
నిజానికి కృష్ణ కూతురు మంజూలకు హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేది. తను కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది కానీ, ఆమెను కృష్ణ అభిమానులు స్వీకరించలేకపోయారు. దీంతో ఆమె నిర్మాణం వైపు అడుగులు వేశారు. అందువల్ల మంజుల తన హీరోయిన్ కలను తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారో, లేక తన కూతురు జాన్వీకి కూడా హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉందో తెలియదు కానీ, జాన్వీ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

