Advertisement

Collector: వర్షంలో ధాన్యం కేంద్రం తనిఖీ.. రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం కురుస్తున్న వర్షంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement