Advertisement

CPGET 2025 | కౌన్సెలింగ్ నేటి నుంచే.. షెడ్యూల్ ఇదే!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ (CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 29) ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. తుది విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement
Advertisement