Bihar Elections : బీహార్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని మిగితా అన్ని పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. మహాకూటమిగా ఏర్పడి ఎన్డీఏపై పోరాటం చేస్తున్నాయి. మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా మహాకూటమి నేతలు బీహార్ కా తేజస్వి ప్రాణ్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. బీహార్ లోని పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మెయిన్ గా ఉపాధి, విద్య, రైతుల సంక్షేమం లాంటి అంశాలపై ప్రస్తావించారు.
మరోవైపు ఆర్జేడీ పార్టీలో ఉన్న నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఆరోపణలతో 27 మంది ఆర్జేడీ నేతలను పార్టీ అధిష్టానం బహిష్కరించింది. పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

