‘కొరియన్ కనకరాజు’గా వరుణ్ తేజ్? ‘వీటీ15’ షూటింగ్ స్పీడ్!
మన పత్రిక, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీటీ15’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే పేరును పరిశీలిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వరుణ్ సరసన ‘మిరాయ్’ భామ రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్-తమన్ కాంబినేషన్లో ఈ చిత్రానికి మరో అదరగొట్టే ఆల్బమ్ రానుందని మేకర్స్ తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
