మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఈ బస్సు, జంక్షన్ వద్ద అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కకు పడిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే డీఆర్డీవో అపోలో, హయత్‌నగర్ ఆస్పత్రులకు తరలించారు. మలుపు వద్ద డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
