టాలీవుడ్ లో బాహుబలి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన ఈ సినిమా ఎందరికో లైఫ్ ఇచ్చింది. రాజమౌళి (Rajamouli) , ప్రభాస్ (Prabhas) ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లపోయారు. ముఖ్యంగా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31 న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ ల హడావిడి ఈ మధ్య తగ్గిపోగా, మళ్ళీ బాహుబలితో రీ రిలీజ్ వైబ్స్ గట్టిగా వస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే రీ రిలీస్ సినిమాల విషయానికొస్తే, సౌత్ మొత్తంలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ గ్రాసర్ గా తమిళ చిత్రం గిల్లి (Gilli) నిలిచింది. ఈ సినిమా రీ రిలీజ్ లో ఏకంగా 32 కోట్లు రాబట్టింది. బాహుబలి ది ఎపిక్ దీని రికార్డు ని బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా చెప్తున్నారు.
ఇక బాహుబలి రెండు పార్ట్స్ ని ఒకే సినిమాగా మలిచి బాహుబలి ది ఎపిక్ (Baahubali the epic) గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో దీనికి భారీగా బుకింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
