బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గా ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్ అదరగొడుతున్నాడు. హౌస్ లో అందరితోనూ యాక్టీవ్ గా ఉంటూ తాను ఎక్కువగా నామినేషన్స్ లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సంజనని మమ్మి అని పిలుస్తూ మదర్ అండ్ సన్ బాండింగ్ పెంచుకుంటూ రాగా, పలుమార్లు సంజనని నామినేషన్స్ లోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు.
అయితే తాజాగా కళ్యాణ్ వల్ల సంజన నామినేట్ కాగానే ఇమ్మాన్యుయేల్ అగ్రెసివ్ అయ్యాడు. నిజానికి కళ్యాణ్ తనుజ (Tanuja) ని నామినేట్ చేస్తానని చెప్తే తాను నామినేట్ చేసే టికెట్ ఇచ్చానని ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సంజనని నామినేట్ చేస్తానంటే తానూ ఇచ్చే వాడ్ని కానని, తనూజ ని నామినేట్ చేస్తానంటే ఇచ్చాననగానే ఇమ్ము పై తనూజాకి ఎక్కడలేని కోపం వచ్చేసింది.
వాళ్లిద్దరూ అరగంట సేపు అరుచుకున్నా కూడా సంజన ఏమి పట్టనట్టు చూస్తుంది. దీంతో ఇమ్మాన్యుయేల్, తనూజా మధ్య సంజన బాగానే చిచ్చు పెట్టింది అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
