పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో దూసుకుపోతూ యమా బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రాజా సాబ్ తర్వాత హను రాఘవపుడి (Hanu Raghavapudi) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్టార్ట్ అయి ఏడాది పైనే అవగా, ఇప్పటికే సగానికి పైగా షూట్ ఫినిష్ అయిన ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
పీరియాడిక్ లవ్ & యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఒక కథా నేపథ్యాన్ని రివీల్ చేశారు. “A Battalion Whos Stands Alone” అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు. అంటే “యుద్ధంలో అతడే ఒక బెటాలియన్” అని అర్ధం. రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ బ్యాక్ షాట్ తో కూడిన ఇమేజ్ ని పెట్టి, చుట్టూ గన్స్ అండ్ బుల్లెట్స్ ఉన్నట్టుగా పోస్టర్ డిజైన్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ని అక్టోబర్ 22 న రివీల్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయగా, ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా టైటిల్ అండ్ పోస్టర్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుదిరితే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఇక ఈ సినిమాలో కొత్త హీరోయిన్ “ఇమాన్వి” హీరోయిన్ గా నటిస్తుండగా, వీళ్ళ జోడి సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
