Today Horoscope : 16 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసికంగా కుంగిపోతారు. కొత్త పనులు మొదలు పెట్టకండి.
వృషభం : ధన లాభం ఉంటుంది. పనికి తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం : ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. దాని వల్ల చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. మానసిక ఆందోళన బాధిస్తుంది. అవకాశాలు కూడా రావు.
కర్కాటకం : ధన లాభం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నూతన కార్యాలు చేస్తారు. దైవారాధన చేయండి.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ ఫలించదు. కుటుంబ సభ్యులు, బంధువులతో సఖ్యతగా ఉండలేరు.
కన్య : ఆరోగ్య సమస్యలతో బాధపడుతారు. బంధుమిత్రులతో సఖ్యత ఉండదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు.
తుల : బంధుమిత్రుల సహకారం లభించదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభాలు ఉంటాయి. నూతన కార్యాలు చేస్తారు. వృథా ప్రయాణాలు చేస్తారు.
వృశ్చికం : విదేశీయానం ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు మానసికంగా బాధిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆటంకం ఏర్పడుతుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
మకరం : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక ప్రణాళికతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీనం : అవసరం ఉన్న చోట ధైర్యం ప్రదర్శిస్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా మాట్లాడరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
