పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా “ఓజి” (OG) సినిమాతో అదిరిపోయే సక్సెస్ ని అందుకోగా, తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) ని కూడా తొందరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా దాదాపు మూడేళ్ళ కిందే మొదలైనా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి సినిమాల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయిపోగా, పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ సినిమా మాత్రమే ఉండడం వల్ల వెంట వెంటనే ఫినిష్ చేసేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తమిళ విలక్షణ నటుడు “పార్తీబన్” (Partiban) ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలక పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ కంఫర్మ్ చేసారు. యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగులోనూ ఫేమస్ అయిన ఈ నటుడు, ఆల్రెడీ రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు పార్తీబన్ బర్త్ డే సందర్బంగా ఆయన్ను మేకర్స్ విష్ చేస్తూ సెట్స్ లో స్టిల్ ని వదిలారు.
అయితే పార్తీబన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కీ రోల్ లో నటిస్తున్నారా? లేక విలన్ గా నటిస్తున్నారా అనేది తెలీదు గాని సెట్స్ లో అయన లుక్ ని చూస్తే పవర్ ఫుల్ రోలె ఉండనుందని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ కి టైం ఇస్తూనే ఈ సినిమా ఫినిష్ చేస్తుండగా, మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
