Advertisement
maganti sunita receives b from from kcr

Maganti Sunita : మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్

Maganti Sunita : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జూబీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఆమెకు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అధికారికంగా మాగంటి సునీతను ఎన్నికల బరిలో దింపుతున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన భర్తను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయిన మాగంటి సునీత మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలవడం కోసమే సునీత కావాలని ప్రజల ముందు, మీడియా ముందు కంటతడి పెడుతున్నట్టు నాటకం ఆడుతున్నారంటూ చేసిన కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా భగ్గుమన్నారు. వాళ్ల విమర్శలను తిప్పికొట్టారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement