Advertisement

Viral: కళ్యాణ్‌పై పికిల్స్ పాప రమ్య మోక్ష సంచలన వ్యాఖ్యలు

గత సీజన్‌లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 ( BiggBoss 9 Telugu ) అనేక కొత్త ట్విస్టులు, మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆరోవారం వైల్డ్ స్ట్రామ్ పేరుతో దివ్వెల మాధురి ( divvela madhuri ) , అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ( Ramya moksha ) , సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో దివ్వెల మాధురి వచ్చిన మొదటి రోజునే కళ్యాణ్‌తో గొడవపడి, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో దివ్వెల మాధురి, పికిల్స్ పాప రమ్య మోక్ష ఈ గొడవ గురించి గుసగుసలాడుకున్నారు. ఈ క్రమంలో రమ్య మోక్ష కళ్యాణ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement
https://twitter.com/dhruvzz_dhruva/status/1977845689561616541

కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడని, అతని ప్రవర్తన కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని రమ్య మోక్ష పేర్కొంది. “తనూజ పై చేతులు వేసి తడుముతుంటాడు.. అది చూస్తే నాకెలాగో ఉంటుంది. నాతో కానీ, అదేవిధంగా ప్రవర్తిస్తే లాగి పెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు దివ్వెల మాధురి బదులిస్తూ, తన ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయడం బాగా లేదని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కళ్యాణ్ అభిమానులు పికిల్స్ పాపపై మండిపడుతున్నారు. ఒకరి క్యారెక్టర్ గురించి అలాంటి స్టేట్‌మెంట్స్ పాస్ చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. మరి ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ అంశంపై ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి.

ఈ వ్యాఖ్యల పర్యవసానం హౌస్‌లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement