Vishnu Vardhan Reddy : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారి అయి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు, ఆయా పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల మరణించిన మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఇంకా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాగంటి సునీత తరుపున బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన రాముడి రాజ్యం కావాలో, రావణుడి రాజ్యం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. నేను ఇక్కడ ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరనివ్వనని విష్ణు వర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

