మన పత్రిక, వెబ్డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) పట్టణంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( SIDDIPET RAINS ) జనజీవనం అస్తవ్యస్తమైంది. కోమటిచెరువు పొంగి పొర్లుతుండటంతో పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, శ్రీనివాస నగర్, సీతారామంజనేయ టాకీస్ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగాయి.
మత్తడి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. హైదరాబాద్ రహదారిలోని బావిస్ ఖానా పూల్ నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి దిగువకు వెళ్లకుండా ఉండేందుకు కలెక్టర్ ఆదేశాలతో పట్టణంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు సాగుతున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
