Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
తన తల్లి తనను మోసం చేయడం వల్లనే కోపంతో కొట్టాను. కానీ.. తప్పు జరిగింది. ఆ వీడియోను కూడా తన తల్లే తీసిందని ఆ వీడియో వైరల్ అవడం వల్ల తను ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నానని సెల్ఫీ వీడియోలో రాజు వాపోయాడు.
Advertisement
తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు రాజు భార్య ఫిర్యాదు చేయడంతో బీబీనగర్ చెరువులో రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

