Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు.
ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె పోరాడినందుకు గాను మరియాకు ఈ పురస్కారం లభించింది.
ఈ పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నాలు లేవు. కానీ, చివరకు ఆయనకు మాత్రం పురస్కారం దక్కలేదు. దీంతో ఈ సంవత్సరం కూడా ఆయన చిరకాల కోరిక అయిన నోబెల్ శాంతి పురస్కారం పొందలేకపోయారు. ఇక.. మరియాకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10వ తేదీన ప్రైజ్ ప్రదానం చేయనున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

