Varinder Ghuman : సినీ ఇండస్ట్రీని గుండెపోటు మరణాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. నిజానికి ఆయన బాడీ బిల్డర్. ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తుంటారు. అయినా ఆయన్ను కూడా గుండెపోటు వదల్లేదు. కేవలం 42 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో వరీందర్ మృతి చెందారు.
వరీందర్ పంజాబ్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ 3 మూవీలో వరీందర్ కీలక పాత్ర పోషించారు. రోర్, మర్జావాన్ లాంటి సినిమాల్లోనూ నటించారు. 2012 లో వచ్చిన పంజాబీ మూవీ కబడ్డీ వన్స్ ఎగైన్ మూవీతో పంజాబ్, హర్యానా ప్రాంతంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే బాడీ బిల్డర్ గానూ మంచి పేరు తెచ్చుకున్నారు వరీందర్. 2009 లో మిస్టర్ ఇండియా టైటిల్, మిస్టర్ ఆసియా రన్నరప్ ను సాధించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
