Today Horoscope : 10 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు మీకు ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం : ధన లాభం ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం చేకూరుతుంది. దూరపు బంధువులను కలుస్తారు. శుభకార్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి.
మిథునం : ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. శుభకార్యాలు చేయాల్సి రావడంతో ధన వ్యయం జరుగుతుంది.
కర్కాటకం : ఎప్పటి నుంచో పూర్తి కాని పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి రంగంలో ఉన్నవారు దూసుకెళ్తారు. తద్వారా మానసిక ఆనందం పొందుతారు. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు.
సింహం : ఆరోగ్యం బాగుంటుంది. దీంతో మీరు ఉల్లాసంగా పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. ఏ పని ప్రారంభించినా అందులో విజయం చేకూరుతుంది. ధన లాభం వరిస్తుంది.
కన్య : బంధుమిత్రులను కలిసి వారితో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం వస్తుంది. తద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
తుల : ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. బంధువులకు, స్నేహితులకు మంచి సలహాలు ఇవ్వడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వినే చాన్స్ ఉంది.
వృశ్చికం : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనవసర ప్రయాణాలు చేయకండి. తద్వారా డబ్బులు వృథా చేసుకోకండి. మానసిక ఆందోళన మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మానసిక ఆరోగ్యం కోసం దైవ ధ్యానం చేయండి.
ధనుస్సు : బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ల సహకారాలు అందవు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
మకరం : ఆర్థిక ఇబ్బందులు బాధపెడతాయి. బంధుమిత్రులతో చాకచక్యంగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది.
కుంభం : కొత్త వ్యక్తుల పరిచయం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు చేస్తారు. కొన్ని కార్యాలు మొదలు పెట్టినా అవి పూర్తి కావు. స్థిరాస్తుల విషయంలోనూ పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మీనం : వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

