Bigg Boss Kannada : బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకున్నా అన్ని ప్రాంతాల వారిని ఈ షో ఆకట్టుకుంటోంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్ షో. తెలుగులోనూ ఇటీవల ప్రారంభమైన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది.
మరోవైపు కన్నడ భాషలో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ఇటీవలే ప్రారంభమయింది. బెంగళూరులో జోలీవుడ్ స్టూడియోలో సెట్ వేసి అక్కడే బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు. కానీ, ఆ స్టూడియో నుంచి ప్రతి రోజు కొన్ని లక్షల లీటర్ల కలుషితమైన నీళ్లు బయటికి వచ్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన కాలుష్య నియంత్రణ బోర్డు ఆ స్టూడియోకు నోటీసులు జారీ చేసింది. అయినా ఆ స్టూడియో సిబ్బంది ఆ నోటీసులను పట్టించుకోలేదు. దీంతో అధికారులు అక్కడికి వెళ్లి ఆ స్టూడియోను సీజ్ చేశారు. ఆ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లను బయటికి పంపించారు. ప్రస్తుతం అందులో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.
అయితే.. దీనిపై బిగ్ బాస్ కన్నడ హోస్ట్ కిచ్చ సుదీప్ స్పందించారు. షో నిర్వహించేలా పర్మిషన్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడంతో వెంటనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించి జోలీవుడ్ స్టూడియోకు నోటీసుల విషయంలో మరికొన్ని రోజుల సమయం ఇవ్వాలని ఆదేశించడంతో వెంటనే బిగ్ బాస్ షో తలుపులు తెరుచుకున్నాయి.
నిజానికి, ఆ నోటీసులకు, బిగ్ బాస్ షోకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఆ షోను మాత్రమే నిర్వహించేందుకు అధికారులు అనుమతించడంతో మళ్లీ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

