Advertisement
Telangana local body elections nominations started

Telangana Local Body Elections : మొదటి విడత స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ

Telangana Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణలో ఉన్న 31 జిల్లాల్లో 565 జెడ్పీటీసీలు, 5749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది.

Advertisement

మొదటి దశలో 2963 ఎంపీటీసీలు, 292 జెడ్పీటీసీ స్థానాల కోసం అక్టోబర్ 23న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు 9 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ వరకు జరగనున్నాయి. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Advertisement

రెండో విడత కోసం అక్టోబర్ 13న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవనుంది. అక్టోబర్ 15 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 27న పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాక, నవంబర్ 11న ఫలితాలను వెల్లడిస్తారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement