Advertisement
Mahesh babu and ss Rajamouli movie title varanasi leaked

Mahesh – SS Rajamouli Movie  : మహేశ్ – రాజమౌళి మూవీ టైటిల్ లీక్?

Mahesh – SS Rajamouli Movie  : ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిలింగా వస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి చర్చ సాగుతోంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఈ సినిమా ఇండియన్ మైథాలజీ, టూరిజం నేపథ్యంలో సాగనున్న కారణంగా ఈ సినిమాకు శైవ క్షేత్రమైన వారణాసి అనే పేరును పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

త్వరలో భారత్ కు రానున్న అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ ను ప్రకటించాలని జక్కన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని ఎలాగూ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ టైటిల్ ను జేమ్స్ కామెరూన్ తో రివీల్ చేయిస్తే ఈ మూవీకి అంతర్జాతీయ ప్రచారం జరిగే చాన్స్ ఉంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పలు ఇతర హీరోలు కూడా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని దుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement