Today Horoscope : 09 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మనోబలంతో పాటు బుద్ధిబలాన్ని కూడా చూపించి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని దర్శించుకోండి. అంతా మంచే జరుగుతుంది.
వృషభం : మీ ఆలోచనలే మీకు ఫలితాలను అందిస్తాయి. కాకపోతే రెస్ట్ ఉండదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకండి.
మిథునం : మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం : మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
సింహం : మీరు ఏ పనులు ప్రారంభించినా అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కానీ, వాటిని అధిగమిస్తారు. అలాగే, మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.
కన్య : మీ భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. అయినా మనోధైర్యంతో ముందుకెళ్తారు.
తుల : ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. మీరు అనుకున్నదది సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికం : వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు.
ధనుస్సు : ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి. మనోబలంతో ముందుకు సాగుతారు. మీరు ఏ పనులు ప్రారంభించినా అవి శుభఫలితాలను అందిస్తాయి.
మకరం : దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు.
కుంభం : మీ బాధ్యతను మీరు నిర్వహిస్తారు. కానీ, ఒక విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
మీనం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

