BC Reservation Bill : తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెద్ద తలనొప్పిగా మారింది. బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ జీవోను పలువురు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పును గురువారానికి అంటే రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు నమోదయ్యాయి. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టింది హైకోర్టు.
పిటిషన్ విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరుపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించినా, హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

