Kantara Chapter 1 : కాంతారా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2022 లో వచ్చిన కాంతార ఫస్ట్ పార్ట్ తోనే రిషబ్ శెట్టి పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క కన్నడ ఇండస్ట్రీనే కాదు, యావత్ భారత సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆ సినిమా తర్వాత సీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమా కూడా రికార్డులను బద్దలు కొడుతోంది.
నిజానికి కాంతార మొదటి పార్ట్ కంటే కాంతార చాప్టర్ 1 ఎక్కువ రికార్డులను తిరగరాస్తోంది. సినిమా రిలీజ్ అయి వారం అవుతున్నా, కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. మూడు రోజుల్లో మూడు వందల కోట్లను వసూలు చేసి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.400 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతార మొదటి పార్ట్ ఓవర్ ఆల్ గా రూ.401 కోట్లను కలెక్ట్ చేయగా, విడుదలైన ఆరు రోజుల్లోనే కాంతార మొదటి పార్ట్ ను బ్రేక్ చేసి రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది కాంతార చాప్టర్ వన్. అంటే తన సినిమా రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. మొత్తంగా సినిమా వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

