Today Horoscope : 08 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఈరోజు జరిగే ఓ ఘటన మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాల కోసం హనుమాన్ ను ఆరాధించండి.
వృషభం : ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని ఏకీభవిస్తారు. మీరు అనుకున్నది సాధించాలంటే మనోబలంతో ముందుకు వెళ్లండి.
మిథునం : వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాల కోసం గణపతి ఆరాధన చేయండి.
కర్కాటకం : వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు ఈరోజు పూర్తవుతాయి. గణపతి నామ స్మరణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం : కుటుంబ సభ్యులు చెప్పేవి వింటే మంచి ఫలితాలు కనబడుతాయి. కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కన్య : వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ, వాటిని మీ మనోబలంతో అధిగమిస్తారు.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని పనులు చాలెంజింగ్ గా ఉంటాయి. అయినా కూడా వాటిని అధిగమిస్తారు.
వృశ్చికం : ఈరోజు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. దాని వల్ల మీరు చాలా సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు : ఈరోజు మీకు కొంచెం ప్రతికూలం అనే చెప్పాలి. కాకపోతే మీకు ఎదురయ్యే ఆటంకాలను మీరు అధిగమిస్తారు. కానీ, ఖర్చులు పెరుగుతాయి.
మకరం : ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభం : సరైన ప్రణాళికతో ముందుకెళ్లండి. లేదంటే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఖర్చులు కూడా పెరుగుతాయి.
మీనం : కొన్ని సమస్యలను మిమ్మల్ని వేధిస్తాయి. మీ తెలివితో వాటిని అధిగమిస్తారు. ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకెళ్తారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

