YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ మాట్లాడిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఎక్కడ చూసినా దోపిడీనే, అర్ధరూపాయికి, పావలాకు భూములు పంచిపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. లిక్కర్ తయారీ చేసే కంపెనీలు తమ ప్రభుత్వంలో ఎలా లిక్వర్ తయారు చేసేది, ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు. ప్రైవేట్ లిక్వర్ షాప్స్ అయితే మాఫియా తరహాలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

