8వ పే కమిషన్ వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 7వ పే కమిషన్ కింద 3% DA పెంపు ఆమోదించింది. దీంతో DA 58%కు చేరింది. ఈ పెంపు దుస్సేరా, దీపావళి పండుగల ముందు రావడం అదనపు బూస్టర్. 2025లో ఇది రెండో పెంపు — మార్చిలో 2% పెరిగింది.
జీతం నవంబర్ నుంచి పెరుగుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అరెర్స్ కూడా చెల్లిస్తారు. ఉదా: ₹18,000 బేసిక్ ఉన్న ఉద్యోగికి నెలకు ₹540 ఎక్కువ. మొత్తం జీతం ₹28,440 అవుతుంది. పెన్షనర్లకు కూడా లాభం — ₹9,000 పెన్షన్ ఉన్నవారికి ₹270 ఎక్కువ, మొత్తం ₹14,220.
8వ పే కమిషన్ జనవరిలో ప్రకటించారు — కానీ సభ్యులు, టెన్యూర్ గురించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ రాలేదు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
